పుష్ప‌కీ.... రాధే శ్యామ్ కీ అదే తేడా!

మరిన్ని వార్తలు

'బాహుబలి' తెలుగు సినిమా దిశని మార్చింది. పాన్ ఇండియా సినిమాకి సరికొత్త బాట వేసింది. బాలీవుడ్ లో జెండా పాతింది. ఇపుడు తెలుగు నుంచి ఒక భారీ సినిమా కోసం బాలీవుడ్ ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఈ క్రెడిట్ బాహుబలికి దక్కుతుంది. అయితే 'బాహుబలి' నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు తెలుగు సినిమా సరిగ్గా నేర్చుకోలేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాని తప్పుగా అర్ధం చేసుకుందనిపిస్తుంది. బహుబాలికి బాలీవుడ్ జనాలు నీరాజనాలు పట్టారు. దీనికి కారణం .. ఆ సినిమాలో వున్న కంటెంట్. కంటెంట్ బావుంటే కొరియన్ సినిమాని కూడా చూస్తాం. బాహుబలి కూడా కంటెంట్ ని నమ్మింది. దాదాపు తెలుగు నటులతోనే బాహుబలి తయారైయింది. అందులో వున్న కంటెంట్ ఆకట్టుకోవడంతో పాన్ ఇండియా సినిమా అయ్యింది. బాహుబలి తర్వాత ప్రభాసే రెండు పాన్ ఇండియా సినిమాలు చేశాడు. అయితే బాహుబలి పాఠం మాత్రం నేర్చుకోలేదనిపిస్తుంది.

 

సాహో కోసం శ్రద్దా కపూర్, నీల్ నితిన్, మందిర బేడి, జాకీ ష్రాఫ్ ఇలా బాలీవుడ్ తారాగణం తీసుకొచ్చింది. రిజల్ట్ ఏమైయింది మళ్ళీ చెప్పాల్సినలేదు. ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అంతే. భాగ్యశ్రీ, కునాల్ కపూర్ ఇలా బాలీవుడ్ నటులని దిగుమతి చేశారు. నిజానికి ఈ రెండు పాత్రలు కూడా మిస్ కాస్ట్. ప్రభాస్ కి తల్లి పాత్ర చేసిన భాగ్యశ్రీ మొహంలో విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తాయి. కొడుకుని చూసిన తల్లి మొహంలో చిన్న ఆత్మీయత వుండాలి. అదేంటో వెరైటీగా చుట్టపు చూపులు చూస్తుంటుంది. ఇక కునాల్ రాయ్ పాత్ర... అన్నో తమ్ముడో ఫ్రెండో అతనికే అర్ధం కాదు. డైలాగులు అప్పగించేయడం తప్పితే అతడి మొహంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ పలకదు. ఈపాటిదానికి బాలీవుడ్ ని తీసుకురావాలా ?

 

పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ నటులు బావుంటుదనే భ్రమలు నుంచి బయటపడాలి. పాన్ ఇండియా సినిమాలకు నటులు ఎంచుకున్నపుడు ఒకసారి బాహుబలి వికీపీడియాలోకి వెళ్లి ఇందులో పాత్రలు వేసిన నటులు ఎవరో చెక్ చేసుకోవాలి. సినిమాలో పాత్రలు బలంగా వుండాలి తప్పితే స్టార్లతో పనిజరగదనే వాస్తవం గ్రహించాలి. నిజానికి తెలుగు నటులనే బాలీవుడ్ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. పుష్ప సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. కొండారెడ్డి, మంగళం శ్రీను, జాలి రెడ్డి పాత్రలతో అక్కడి మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ నటులే ఉండాలనే డిమాండ్ లేదు. కానీ ఇక్కడి సినీ రూపకర్తలే అతి జాగ్రత్తలు తీసుకొని ఒరిజినాలిటీని మిస్ చేసుకుంటున్నారని చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS