చేసిన సినిమాలు తక్కువే కానీ, ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన రెండు సినిమాలూ స్టార్‌హీరోతోనే చేసింది. అది కూడా ఒకే హీరో, ఆయనే నందమూరి నటసింహం బాలయ్యబాబుతో. అవే 'లయన్', 'లెజెండ్' సినిమాలు. కాస్టింగ్ కౌచ్ విషయంలో మొదటగా స్పందించింది ఈ ముద్దుగుమ్మే కూడా. అయితే సినిమాల్లో అమ్మడు చేసిన స్కిన్ షో అంతా ఇంతా కాదు.
ఏకంగా నగ్నంగా నటించేసింది కూడా. అయితే తాను నటించొచ్చు కానీ, ఎవరూ ఆమెను కామెంట్ చేయకూడదనేది ఈ హాట్ బ్యూటీ అభిప్రాయం. అలా ఎలా కుదురుతుంది చెప్పండి. 'పర్చేద్' సినిమాలో అమ్మడు చేసిన నగ్న ప్రదర్శనకు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అప్పుడెప్పుడో జరిగిపోయిన ఇష్యూస్‌కి ఇప్పుడు కొత్తగా తెర పైకి తీసుకొచ్చి, తనను సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేస్తున్నారంటూ నెటిజన్స్‌పై ఫైర్ అవుతోంది. ఇదేమైనా సబబుగా ఉందా చెప్పండి. తెలుగులో అమ్మడికి అవకాశాలు లేవు.
తమిళంలో 'కబాలి' తర్వాత మరో సినిమాలో చేయలేదు. హాలీవుడ్‌లో రీసెంట్‌గా ఓ సినిమాలో నటించింది. లేటెస్టుగా హిందీలో ఓ సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడి నగ్న ప్రదర్శన టైంలో జరిగిన రచ్చ తప్ప ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మని పెద్దగా గుర్తు పెట్టుకున్న వాళ్లు కూడా లేరు. అయితే ఎందుకిలా ఇప్పుడు నెటిజన్స్‌పై ఫైర్ అవుతోందో రాధికా ఆప్టే తెలియడం లేదు.
ఏదోలా మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది కాబోలు.!