గ్లామరస్ పాత్రలకే కాదు, డీ గ్లామర్ రోల్స్‌కైనా సై అనే భామ రాధికా ఆప్టే. చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ అమ్మడు హీరోయిన్గా చాలా పాపులర్. డిఫరెంట్ నేపథ్యం ఉన్న సినిమాలను ఎక్కువగా ఎంచుకుంటూ వుంటుంది. అలాగే వివాదాలతో కూడా కొంచెం ఎక్కువగానే సావాసం చేస్తుందిలెండి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'కబాలి' సినిమాలో డీ గ్లామర్ రోల్లో నటించింది రాధికా ఆప్టే. ఇక తెలుగు విషయానికి వస్తే, చేసిన రెండు సినిమాలు బాలయ్యతోనే నటించింది. హిందీలో నటించినవి కూడా పాపులర్ సినిమాలే. ఇలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతోంది రాధికా ఆప్టే.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో 'ప్యాడ్మాన్' చిత్రంలో నటిస్తోంది. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాలో. మహిళలు రుతుక్రమం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ ఆవగాహనపై ఓ సాధారణ వ్యక్తి చేసే పోరాటమే ఈ సినిమా కథ. యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా తమ వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. సినిమా సంగతి ఇలా ఉంచితే మన హీరోయిన్‌గారు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఫ్యాన్స్‌తో పంచుకున్నారు అవేంటో తెలుసుకుందాం సరదాగా.
'హీరోయిన్ అంటే సులువుగా డబ్బులు సంపాదించేయవచ్చు అనుకుంటారంతా. కానీ సంపాదించిన డబ్బుల్ని దాచుకునేదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా హీరోయిన్సే..'అంటోందీ భామ. మెయింటెనెన్స్‌లో హీరోలతో పోల్చితే, హీరోయిన్స్‌కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్లు తమ అందాన్ని, ఫిజిక్‌ని కాపాడుకోవాలి. అవి కరెక్ట్‌గా ఉంటేనే కదా తర్వాతి సినిమాల్లో ఆఫర్లు వచ్చేది. హీరోలకైతే ఈ ప్రాబ్లం కొంచెం తక్కువేననీ, అందుకే ఆ విషయంలో హీరోల పట్ల తనకు అసూయ అంటోంది ముద్దుగుమ్మ రాధికా ఆప్టే.