నిన్న అర్ధరాత్రి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ పెద్ద బాంబ్ పేల్చారు. ఎలక్షన్స్‌లో పోటీ చేయబోతున్నాననీ.. అదీ పవన్ కళ్యాణ్‌కి పోటీగా భీమవరం నుండి పోటీ చేస్తాననీ వర్మ ట్వీట్ చేశారు. అయితే ఈ మాటను ఎవ్వరూ నమ్మలేదు. ఎందకంటే నామినేషన్ల గడువు పూర్తయ్యాక, తిరిగా నామినేషన్ వేయడం ప్రధానమంత్రికి కూడా అవకాశం లేదు. అదీ మన రాజ్యాంగ నిర్ణయం.
అయితే వర్మ మాత్రం ఉన్నతస్థాయి అధికారుల సపోర్ట్‌తో ఎన్నికల కమీషన్‌ని రిక్వెస్ట్ చేసి మరీ నామినేషన్ వేయబోతున్నానంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ సారి మాత్రం వర్మని ఎవ్వరూ నమ్మలేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆర్జీవీ ఇంకో పోస్ట్ పెట్టారు. తూచ్ ఇదంతా ఉత్తిదే. ఇది జస్ట్ ఏన్ అడ్వాన్స్‌డ్ ఏప్రిల్ ఫూల్ జోక్ అంతే అని చేతులు దులిపేసుకున్నారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అన్ని సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు ముందుంది అన్న సంగతి తెలిసినా, వర్మ పేల్చిన జోక్‌ని ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు.
సో ఈ జోక్ అంతగా పండలేదు మరి. ఏది ఏమైనా దటీజ్ రామ్‌గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా అలాగే ఉంటుందంతే. నమ్మండి. నమ్మకపోండి.. ఈ మ్యాటర్ ఇలా ఉంటే, రేపు అనగా 29న వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలతో హైప్ క్రియేట్ చేసిన వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో ఏం చేస్తాడో చూడాలి మరి.