అదేంటో గానీ... 'ఎన్టీఆర్' బయోపిక్‌కి ఏదీ కలసి రావడం లేదు. బసవతారకం పాత్ర కోసం ఎంత మందిని సంప్రదించినా ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ఏకంగా దర్శకుడి కుర్చీనే ఖాళీ అయిపోయింది. `ఈ సినిమా నేను చేయలేను` అంటూ తేజ సైడ్ అయిపోవడంతో... ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటారన్నది ఆసక్తిగా మారింది.
లిస్టులో కె.రాఘవేంద్రరావు పేరు కూడా ఉంది. అయితే.. రాఘవేంద్రరావు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో చేతులెత్తేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్‌కి తాను కూడా దర్శకత్వం వహించలేనని, ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో బిజీగా ఉండడం వల్ల, అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేనని బాలయ్యకు చెప్పాడట దర్శకేంద్రుడు.
దాంతో ఉన్న ప్రత్యామ్నాయాలతో.. ఒకదానికి తలుపులు మూసుకున్నట్టైంది. ఇక మిగిలింది క్రిష్, కృష్ణవంశీ, పూరీలే. వాళ్లెంచెబుతారో చూడాలి.