బిగ్‌ ఫైట్‌: నేరం చేసిందెవరు?

మరిన్ని వార్తలు

శిక్ష అనుభవిస్తున్నదెవరు.? 'దొంగల రాజ్యంలో నగరవాసులు' టాస్క్‌లో ఇటు దొంగల టీమ్‌, అటు నగరవాసుల టీమ్‌ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. ఇద్దరూ తమ తమ డెన్స్‌ కాపాడుకోవడానికి ఒకరినొకరు ఓడించడానికి చెమటోడ్చి కష్టపడ్డారు. వర్షంలో కిందా మీదా జారి పడుతూ, ఫైట్‌లో భాగంగా ఒకరి మీద ఒకరు పడుతూ, స్విమ్మింగ్‌ పూల్‌లో పైన వర్షం, కింద వాటర్‌లో నిధి బాక్స్‌ని దక్కించుకోవడానికి పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఫైట్‌ జరిగే క్రమంలో కొంతమంది చిన్న చిన్నగా గాయాల పాలయ్యారు.

 

ఒకరినొకరు నిందించుకున్నారు. కొందరు అగ్రెసివ్‌ అయ్యారు. ఇంకొందరు కామ్‌గా అన్నీ ఓర్చారు. ఇంతా చేసి, రెండు రోజుల పాటు టఫ్‌ సిట్యువేషన్‌లో జరిగిన ఈ టాస్క్‌ని బిగ్‌బాస్‌ అర్ధాంతరంగా రద్దు చేసి పాడేశారు. హౌస్‌లో ప్రాపర్టీస్‌ దెబ్బ తింటున్నాయనీ, హింసకు పాల్పడుతున్నారనే కారణంతో ఈ టాస్క్‌ని రద్దు చేస్తున్నామని బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే, ఇలాంటి టాస్క్‌ ఇచ్చేటప్పుడే బిగ్‌బాస్‌ ఆలోచించాల్సి ఉండాలి. టాస్క్‌ ఇచ్చాక, ఆ తరహా మ్యాన్‌ హ్యాండిలింగ్స్‌ తప్పని సరి. ఇకపోతే టాస్క్‌లో అలీ చాలా అగ్రెసివ్‌గా బిహేవ్‌ చేశాడు. కానీ, అలీని నేరం నుండి తప్పించారు. కావాలని రాహుల్‌నీ, రవిని ఇరికించారు.

 

ఈ టాస్క్‌ రద్దు కావడానికి కారణం రాహుల్‌ అంటూ 8 మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. అఫ్‌కోర్స్‌ హౌస్‌లో ఏ చిన్న తప్పు జరిగినా, సెంటర్‌ చేసేది రాహుల్‌నే. సో అలా రాహుల్‌ సెంటర్‌ అయ్యాడు. అయినా అది రాహుల్‌కి అలవాటైపోయింది. అయితే, ఏ తప్పు చేయకుండా, చాలా కంట్రోల్డ్‌గా గేమ్‌ ఆడిన రవికృష్ణ అనవసరంగా బలైపోయాడు. రవికృష్ణ ప్లేస్‌లో అలీ ఉండాల్సింది, తెలివిగా శ్రీముఖి అలీని తప్పించి రవికృష్ణని బుక్‌ చేసింది. అలా చేసిన నేరానికి శిక్షగా వీరిద్దరూ జైలుకెళ్లాల్సి వచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS