పునర్నవితో రాహుల్‌ జర్నీ ఆగేది కాదు!

మరిన్ని వార్తలు

పునర్నవి - రాహుల్‌ ఈ జంటకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్‌ సీజన్‌ 3 బెస్ట్‌ పెయిర్‌గా వీరిద్దరి పేరు మార్మోగిపోయింది. ప్రతీ మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది.. అనడం ఎంత కరెక్టో రాహుల్‌ని చూసి ఇంకోసారి కన్‌ఫామ్‌ చేసుకోవడం తప్పేమీ కాదు. రాహుల్‌ విజయం వెనక పున్నరవి హస్తం ఎంతో కొంత లేకపోలేదు. ఇకపోతే, బయటికొచ్చాక కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగనుందట. 'ప్రేమ, పెళ్లి అనేది తమ మధ్య అసలు విషయమే కాదు. కానీ, పునర్నవి తనకు వెరీ వెరీ స్పెషల్‌.. అంతే. మా ఫ్యామిలీకి కూడా పునర్నవితో స్నేహం గురించి తెలుసు..' అంటూ రాహుల్‌ బయటికొచ్చాక ఇంకోసారి క్లారిటీ ఇచ్చాడు.

 

మరోవైపు పునర్నవి ఫ్యామిలీ మెంబర్స్‌, రాహుల్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కలిసి ఓ గెట్‌ టుగెదర్‌ ఏర్పాటు చేసుకున్నారనీ, ఈ సందర్భంగా రాహుల్‌, పునర్నవి ఒప్పుకుంటే, వారిద్దరికీ పెళ్లి చేసేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని వారి వారి పేరెంట్స్‌ అనుకున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. అయితే, ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ, త్వరలో రాహుల్‌, పునర్నవి కలిసి ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేయనున్నారట. అలా కలిసి ఓ ఆల్బమ్‌ చేయాలని వీరిద్దరూ హౌస్‌ లోపల ఉన్నప్పుడే డీల్‌ సెట్‌ చేసుకున్నారట. త్వరలో ఆ ఆల్బమ్‌ కోసం రెడీ కానున్నారట రాహుల్‌ - పునర్నవి. సో రాహుల్‌, పునర్నవి జర్నీ అప్పుడే ముగిసిపోలేదన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS