'మెంటల్‌' భామకి మంచి రోజులు.!

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం 'మెంటల్‌ మదిలో'. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. తొలి సినిమాకే నటనలో మంచి మార్కులేయించుకుంది. యాక్టింగ్‌ టాలెంట్‌తో సూపర్బ్‌ అనిపించుకున్నా, పెద్దగా జనంలో రిజిస్టర్‌ కాలేదీ భామ అప్పట్లో. అయితే, ఇటీవల మెగా కాంపౌండ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో 'చిత్రలహరి' సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించింది. ముందులానే తన యాక్టింగ్‌తో మెప్పించడంతో పాటు, ఈ సారి ఫేస్‌ వేల్యూ కూడా దక్కించుకుంది.

 

సో నివేదా పేతురాజ్‌ అంటే ఈమెనే అని ఆడియన్స్‌ గుర్తు పట్టేశారు. దాంతో పాపకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో..' నివేదా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా నివేదా పేతురాజ్‌ మంచి రోలే దక్కించుకుంది. అందులోనూ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చేతిలో పడ్డ హీరోయిన్స్‌కి మంచి ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది. అలాంటిది, పాప అసలే టాలెంటెడ్‌ కదా.. ఇక ఇరగదీసే క్యారెక్టర్‌ ఇచ్చాడని అంటున్నారు.

 

సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం, అంతకు ముందే నివేదా పేతురాజ్‌ మరో సినిమాతో సందడి చేయబోతోంది. అదే 'విజయ్‌సేతుపతి'. తమిళంలో 'సంగతమిళై' అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్‌ 15న 'విజయ్‌సేతుపతి' టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో హీరోయిన్‌ కాగా, రాశీఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS