రాహుల్‌తో రొమాన్స్‌కి నో అన్న పునర్నవి!

మరిన్ని వార్తలు

బిగ్‌హౌస్‌లో రియల్‌ దంపతులు వరుణ్‌, వితికల తర్వాత ఆసక్తికరమైన జంటగా రాహుల్‌ - పునర్నవి ఖ్యాతికెక్కారు. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్యా జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా పెద్ద క్లాష్‌ వచ్చింది. ఆ పెద్ద క్లాష్‌ని తీర్చుకునే దిశగా ఈ జంట ప్రయత్నాలు చేయడం లేదు. వీరిద్దరి మధ్యా వచ్చిన క్లాష్‌ని తీర్చడానికి బిగ్‌బాస్‌ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు టాస్క్‌ల రూపంలో. వీరిద్దరికీ లింకులు పెట్టి టాస్క్‌లు డిజైన్‌ చేస్తున్నాడు. టాస్క్‌ల్లో పర్‌ఫామెన్స్‌ బాగానే చేస్తున్నారు కానీ, వీరి మధ్య పెరిగిన దూరాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు.

 

తాజాగా లవ్వాలజీ ప్రపోజల్‌ టాస్క్‌లో భాగంగా, పునర్నవి, రాహుల్‌ ఓ జంటగా ఫామ్‌ అవ్వమని హౌస్‌మేట్స్‌ సూచించగా, పునర్నవి ససేమిరా అంది. రాహుల్‌తో జోడీ కట్టడం నా వల్ల కాదంది. ఎంతగా నచ్చచెప్పినా ఒప్పుకోకపోయేసరికి, రాహుల్‌, హిమజ జత కట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా, 'మనోహరా..' అనే రొమాంటిక్‌ సాంగ్‌కి రొమాంటిక్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చి హౌస్‌లో నవ్వులు పూయించారు.

 

ఈ ఇద్దరూ డాన్సుల్లో కొంచెం వీక్‌. అయినా కానీ, తమకొచ్చిన డాన్స్‌తోనే రొమాంటిక్‌ సాంగ్‌ని మరింత రొమాంటిక్‌గా రక్తి కట్టించారు. వీరి రొమాన్స్‌ చూసి పైకి నవ్వుతూ, ఆశ్చర్యపోతూ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చినా, లోలోపల అయ్యో రాహుల్‌తో ఇంత మంచి సాంగ్‌కి రొమాన్స్‌ చేసే ఛాన్స్‌ చేతులారా పోగొట్టుకున్నానే అని బాధపడినట్లు కనిపించింది పునర్నవి. మొత్తానికి రాహుల్‌ - హిమజల మధ్య లవ్‌ ప్రపోజల్‌ చాలా క్యూట్‌గా హాట్‌గా ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌ అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS