రాహుల్‌ కోసం పున్ను ఏం చేయలేదే?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో టాస్క్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఈ సారి వింతగా జరిగిన నామినేషన్స్‌ ప్రక్రియలో పునర్నవి కోసం, రాహుల్‌ ఏకంగా 20 గ్లాసుల కాకరకాయ రసం తాగేశాడు. మరి రాహుల్‌ కోసం పునర్నవి ఏం చేసింది.? అంటే, రాహుల్‌ని సేవ్‌ చేయాలంటే, పునర్నవి ఈ సీజన్‌ మొత్తం నామినేట్‌ కావాలి.. అనేది బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌. కానీ, మన గుడ్‌ బోయ్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అనవసరంగా తన కారణంగా ఎవరినైనా ఇరికించడానికి అస్సలు ఒప్పుకోడు కదా.. అదే చేశాడు.

 

పునర్నవి, రాహుల్‌ కోసం ఈ టాస్క్‌కి ఆల్‌మోస్ట్‌ ఓకే చెప్పేసింది. డైరెక్ట్‌గా సీజన్‌ మొత్తం నామినేట్‌ అయిపోతానని ఒప్పుకుంది. కానీ, రాహుల్‌ ఆమెని సముదాయించి, ఈ వారం నామినేట్‌ కావడానికి తానే ఒప్పుకున్నాడు తప్ప, పునర్నవిని ఆ సాహసం చేయనివ్వలేదు. ఈ నేపథ్యంలో చాలా సేపు వీరిద్దరి మధ్యా డిస్కషన్‌ జరిగింది. రాహుల్‌ని పునర్నవి సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనుకుంటోంది కానీ, రాహుల్‌ మాత్రం టేక్‌ ఇట్‌ ఈజీ మేనర్‌లో వ్యవహరిస్తున్నాడు. పునర్నవి రాహుల్‌కిచ్చే సలహాలు, సూచనల్లో ఆయన మంచి తనం కోరుకోవడమనే అభిప్రాయమే తప్ప, ఎలాంటి స్వార్ధం కనిపించదు.

 

కానీ, రాహుల్‌ అది అర్ధం చేసుకోలేకపోతున్నాడా? ఓ నసలాగే పునర్నవిని తీసుకుంటున్నాడు తప్ప, ఆమె నిస్వార్ధపు స్నేహాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాడా? అనే అనుమానాలు బిగ్‌బాస్‌ వీక్షకుల్లో కలుగుతున్నాయి. బిగ్‌బాస్‌ వీరిద్దరినీ టార్గెట్‌ చేసే విధానంలో కూడా మరో ఆప్షన్‌ లేకుండా పక్కాగా ఇరికించేసే టాస్క్‌లే ఇస్తున్నాడు. తాజా నామినేషన్‌ టాస్క్‌లో కూడా అంతే, సీజన్‌ మొత్తం నామినేట్‌ కావడమైనా, 20 గ్లాసుల కాకరకాయ రసం తాగడం లాంటివి అయినా ఆప్షన్‌ లేని అవకాశాలు. చూస్తున్న ఆడియన్స్‌లో ఇదే డిస్కషన్‌ జరుగుతోంది. పాపం కష్టాలన్నీ వీళ్లిద్దరికేనా.? అనుకునేలా సిట్యువేషన్స్‌ సెట్‌ చేస్తున్నాడు బిగ్‌బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS