పోస్ట్‌పోన్‌ అయిన 'సైరా' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. కానీ!

By Inkmantra - September 17, 2019 - 16:15 PM IST

మరిన్ని వార్తలు

ఈ నెల 18న 'సైరా నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగాల్సి ఉంది. కానీ, ఈ వేడుకను వాయిదా వేసినట్లుగా తాజాగా చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్లాన్‌ చేశారు. పవన్‌ కళ్యాణ్‌తో సహా, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ఈ ఈవెంట్‌కి హాజరు కావల్సి ఉంది. అయితే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా, ఇది ఓపెన్‌ స్టేడియం కావడంతో అభిమానులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో ఈ ఈవెంట్‌ని వాయిదా వేశారట.

 

ఈ నెల 22న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ ఈవెంట్‌కి పవన్‌ కళ్యాణ్‌ హాజరు కాకపోవచ్చుననే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పవన్‌ కళ్యాణ్‌ రాకపోవచ్చనే కారణాలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా పడిందని ఫ్యాన్స్‌ కలత చెందడానికి లేదు. ముందుగా అనుకున్నట్టుగానే అదే రోజు అనగా సెప్టెంబర్‌ 18, బుధవారం 'సైరా నరసింహారెడ్డి' ట్రైలర్‌ విడుదల చేయనున్నారట.

 

ఇంకేముంది ఫ్యాన్స్‌కి ఈ పండగ చాలదా.? సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్నా, నిహారిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'సైరా'కి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS