చందమామ కాజల్ అగర్వాల్‌పై ఇంతవరకూ ఎలాంటి లవ్ అఫైర్స్ లేవు. గాసిప్స్ కోసమైనా గాలి వార్తలు కూడా పుట్టలేదింతవరకూ. అయితే, ఇప్పుడు కాజల్ ప్రేమలో పడింది.. విన్నారా? ఎవరు? ఏంటీ? అని ఆతృత పడిపోతున్నారా.? నిదానమే ప్రధానమండీ బాబూ! కొంచెం ఓపిక పట్టండి. ఇంతకీ కాజల్ ఎవరితో ప్రేమలో పడిందంటే.. 'తాజ్‌మహల్'తో హా.. హా.. హా..! అవునండీ తాజ్‌మహల్‌ని మొదటిసారి చూసిన కాజల్ మంత్ర ముగ్ధురాలయ్యిందట.
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ శిల్ప సౌందర్యానికీ, అక్కడి సౌండ్ సిస్టమ్‌కీ ఫిదా అయిపోయిందట. అంతే వెంటనే లవ్‌లో పడిపోయిందట. ప్రేమ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంతవరకూ తనకు రాలేదు. కానీ, తాజ్‌మహల్‌ని చూస్తే ప్రేమ గొప్పతనం తెలిసిందంటోంది. తన ప్రియురాలు, భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా ఈ అద్భుతమైన కట్టడాన్ని కట్టించాడు షాజహాన్. ఇది చరిత్రలో చిన్నప్పటి నుండీ చదువుకుంటున్న పాఠమే. ఎవరైనా ఆ కట్టడాన్ని చూసి ముగ్ధులవ్వాల్సిందే.
విహార యాత్రలంటే ఎంతో ఇష్టమైన కాజల్ ప్రపంచంలో ఎన్నో ప్రదేశాల్ని సందర్శించింది కానీ, తొలిసారిగా తాజ్‌మహల్‌ని ఇప్పుడే సందర్శించిందట. తాజ్‌మహల్ కోసం విన్న గాధలు, కథలు అన్నీ అక్షరాలా నిజాలే. అంతకు మించి అనేలా ఉంది స్వీయ అనుభవం.. అని తాజ్‌మహల్‌తో సరదాగా దిగిన ఫోటోల్ని షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్త పరిచింది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.