నా పెళ్లి.. ఈ విష‌యం ఎవ్వ‌రికీ చెప్పొద్దు ప్లీజ్‌!

By iQlikMovies - October 23, 2018 - 15:43 PM IST

మరిన్ని వార్తలు

అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమ‌స్ అయిపోయాడు రాహుల్ రామ‌కృష్ణ‌. తెలంగాణ యాస‌లో రాహుల్ చెప్పే డైలాగులు భ‌లే త‌మాషాగా ఉంటాయి. విభిన్న‌మైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో అన‌తికాలంలోనే ఆక‌ట్టుకున్నాడు. 

ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. అవును.... ఈ హాస్య న‌టుడి పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతోంది. ఈ విష‌యాన్ని కూడా రాహుల్ త‌న‌దైన శైలిలో స‌ర‌దాగా చెబుతూ...  ఖ‌రారు చేశాడు కూడా. `జ‌న‌వ‌రి 15న నా పెళ్లి... ఈ విష‌యం ఎవ‌రికీ చెప్పొద్దు ప్లీజ్‌.. ఈ విష‌యం చాలా సీరియ‌స్‌గానే చెబుతున్నా`` అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.

`సైన్మా` అనే షార్ట్ ఫిల్మ్‌తో పాపుల‌ర్ అయిన రాహుల్‌.. `శ్రీ‌మంతుడు`లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించాడు. ఈమ‌ధ్య వ‌చ్చిన `నోటా`లోనూ ఓ కీల‌క పాత్ర పోషించాడు. ఇప్పుడు అత‌ని చేతిలో డ‌జ‌ను సినిమాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS