రామ్ చరణ్-బోయపాటిల 35కోట్ల డీల్!

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర సమాచారం బయటికొచ్చింది.

ఆ వివరాలిలా ఉన్నాయి- రామ్ చరణ్, బోయపాటి శ్రీనులు ఈ చిత్రానికి సుమారు రూ 35 కోట్ల మేర రెమ్యునరేషన్ రూపంలో తీసుకోబోతున్నారట. అందులో రూ 20 కోట్ల రూపాయలు రామ్ చరణ్ తీసుకోనుండగా దర్శకుడు బోయపాటి శ్రీను రూ 15 కోట్లు తీసుకుంటున్నారట.

వీరిద్దరి రెమ్యునరేషన్ లకే రూ 35 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా మిగిలిన బడ్జెట్ కోసం మరో 40-50 కోట్ల వరకు వెచ్చించనున్నారట!. అయితే ఈ బడ్జెట్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది, ఇంకా 30 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న ఈ తరుణంలో బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ అయ్యే ఆస్కారముందట.

ఏదేమైనా... సుమారు రూ 80 నుండి 90 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ జరిగితే తప్ప ఈ చిత్రం లాభాల బాట పట్టే అవకాశం లేనట్టే! అయితే చరణ్-బోయపాటి ల మార్కెట్ వేల్యూ బట్టి ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS