అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయిన హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ. తనదైన శైలి డైలాగ్ డెలివరీతో.. మేనరిజంతో భలే నవ్విస్తాడు. గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్టయిన `జాతిరత్నాలు`లో తాను కూడా ఓ హీరోనే. యేడాది పొడవునా సినిమాలు చేస్తూ,రెండు చేతులా సంపాదిస్తున్నాడు. టాలీవుడ్ లో బిజియెస్ట్ కమిడియన్లలో తానొకడు. అయితే ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని.. ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. దాంతో.. అంతా షాక్ కి గురయ్యారు.
నటుడిగా కెరీర్ పీక్స్‌లో ఉండగా, ఇలా అనూహ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అంతు పట్టడం లేదు. రాహుల్ నటించిన చిత్రాల్లో ఆర్ఆర్ఆర్, విరాటపర్వం వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రాహులు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ప్రాంక్ చేస్తున్నావా ? లేదా ఏదైనా ప్రమోషన్ కోసమా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రాహుల్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండకూడదు. ఇదే నిజమైతే.. ఓ ప్రతిభావంతుడైన నటుడి కెరీర్ అర్థాంతరంగా ముగిసినట్టే.