యంగ్ హీరోలు మల్టీ టాలెంట్‌ని ప్రదర్శిస్తున్నారు. ఒక పక్క నటులుగా మెప్పిస్తూనే, మరో పక్క దర్శకత్వంలోనూ, నిర్మాణంలోనూ కూడా రాణిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా మారి, తండ్రి చిరంజీవితో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అలాగే యంగ్ హీరో అవసరాల శ్రీనివాస్ ఓ పక్క కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా పలు రకాల నటిస్తూ, దర్శకుడిగానూ సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇదే దారిలో మరో యంగ్ హీరో జాయిన్ అయ్యాడు. రాహుల్ రవీంద్రన్. చాక్లెట్ బోయ్‌లా కనిపించే మనోడు మెగా ఫోన్ పట్టబోతున్నాడు. అక్కినేని మేనల్లుడు సుశాంత్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. 'చి.ల.సౌ' టైటిల్‌తో ఓ మంచి లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడు రాహుల్ రవీంద్రన్. మరో పక్క హీరోగానూ సినిమాలు వదులుకోనంటున్నాడు. రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కుతోన్న 'హౌరా బ్రిడ్జ్' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా దర్శకత్వంపై ఆశక్తితోనే ఈ రంగంలోకి అడుగు పెట్టానంటున్నాడు. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి. అందుకే హీరోగా వచ్చిన ఏ అవకాశాన్ని వదలుకోనంటున్నాడు మనోడు. కానీ దర్శకుడిగానూ మంచి సినిమాలు తెరకెక్కిస్తానంటున్నాడు. అలా అని దేనినీ తక్కువగా చేసి చూడకూడదంటున్నాడు మన యంగ్ హీరో. నటనకుండే వేల్యూ నటనదే. దర్శకత్వ పరంగా క్రియేటివిటీకి ఉండే వేల్యూ క్రియేటివిటీదే. దేన్నీ మరో దాంతో పోల్చి చూడలేమంటున్నాడు రాహుల్ రవీంద్రన్.