బిగ్‌బాస్‌ 3: శ్రీముఖి గెలుపు ఓటముల లెక్క ఇది!

మరిన్ని వార్తలు

15 మంది కంటెస్టెంట్స్‌, రెండు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. టోటల్‌ 16 మంది సభ్యులతో స్టార్ట్‌ అయిన బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో టాప్‌ 5 కంటెస్టెంట్స్‌లో శ్రీముఖి ఒకరు. క్లైమాక్స్‌కి చేరిన బిగ్‌బాస్‌ 3లో శ్రీముఖి గెలుపు ఎందుకు జరగాలి.? అని ప్రశ్నిస్తే, అందుకు ప్లస్‌లు, మైనస్‌లూ కూడా మాట్లాడుకోవల్సి వస్తుంది. శ్రీముఖి ఎందుకు గెలవాలి.? అని అడిగితే, స్టార్టింగ్‌ నుండీ శ్రీముఖి హౌస్‌కి మ్యాగ్జిమమ్‌ ఎంటర్‌టైనర్‌. ఎప్పుడూ ఎనర్జీ మిస్‌ కాలేదు. చాలా విషయాల్లో హోస్ట్‌ నాగార్జున కూడా ఆమెని సరిగ్గా క్వశ్చన్‌ చేయలేదు.

 

దాంతో బిగ్‌బాస్‌ నిర్వాహకుల నుండి ఫుల్‌ సపోర్ట్‌ శ్రీముఖికే ఉందని అర్ధమవుతోంది. ఇకపోతే, ఆమెకు మరో ప్లస్‌ పాయింట్‌ డాన్సులు. ఆమెకు కత్తి లాంటి డాన్సింగ్‌ ఛాన్స్‌ వచ్చింది. హౌస్‌కి సంబంధించి డాన్సుల్లో శ్రీముఖిదే బెస్ట్‌ అండ్‌ ఫస్ట్‌ ప్లేస్‌. కేరింగ్‌ విషయంలోనూ శ్రీముఖిదే ఫస్ట్‌ ప్లేస్‌. హౌస్‌ మేట్స్‌ విషయంలో శ్రీముఖి తీసుకున్న రెస్పాన్సిబులిటీ మరే ఇతర కంటెస్టెంట్‌ తీసుకోలేదని బిగ్‌బాస్‌ వీక్షకుల అభిప్రాయం. అయితే, ఒక్కోసారి ఆ కేరింగ్‌లో ఆమె చూపిన అత్యుత్సాహం మిగిలిన వారిని ఇరిటేట్‌ చేసిందని తోటి కంటెస్టెంట్‌ మహేష్‌ చెప్పగా విన్నాం. టాస్క్‌ల్లో శ్రీముఖి నిజానికి పీకిందేమీ లేదు. కానీ, ఆడినట్టుగా బయటి నుండి మ్యానేజ్‌ చేసే తీరు ఆమె తెగ కష్టపడిపోయిందని ప్రొజెక్ట్‌ అయ్యింది. స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువగా తీసుకోవడమే ఆ భ్రమ కలగడానికి కారణం.

 

ఒక్కోసారి అతి సిల్లీ టాస్క్‌ల్లో కూడా శ్రీముఖి చేతులెత్తేయడం చూశాం. కన్నింగ్‌, గేమ్‌ స్ట్రాటజీ తప్ప, ఎవరితోనూ జెన్యూన్‌ రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేయదనే రూమర్‌ కూడా ఉంది శ్రీముఖిపై. మనిషి అన్నాక, ప్లస్‌లూ, మైనస్‌లూ సహజమే. అయితే, గత రెండు సీజన్స్‌లో మేల్‌ కంటెస్టెంట్సే విన్నర్స్‌గా నిలవడంతో ఈ సారి ఫిమేల్‌ కంటెస్టెంట్‌కి ఆ ఛాన్స్‌ దక్కనుందనే టాక్‌ వినిపిస్తున్న దర్మిలా శ్రీముఖికి గెలుపు అవకాశాలు ఎక్కువే అని చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS