బిగ్ బాస్ హౌస్ లో మెగాస్టార్ చిరంజీవి..!

By Madhukishore - September 23, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

హైదరాబాద్ కి కూడా సముద్రాన్ని తీసుకొచ్చిన ఘనత మెగాస్టార్ 151వ చిత్రం 'సైరా' కే దక్కింది. మెగాస్టార్ 'చిరంజీవి' హీరోగా నటిస్తూ, రామ్ చరణ్ నిర్మాతగా 'కొణిదెల ప్రొడక్షన్స్' బ్యానర్ లో, సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మెగా అభిమానుల పవర్ ఏంటో చూపించారు. మెగా హీరోస్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు దర్శక ధీరుడు రాజమౌళి రాకతో ఈ ఈవెంట్ సైరా కు ఒక బిగ్గెస్ట్ ప్రమోషన్ గా నిలిచింది.

 

ఇక పోతే బిగ్ బాస్ సీజన్లో విడుదలయ్యే చిత్రాలు ప్రమోషన్ కోసం వారి టీం నుండి షో కు వచ్చి కాసేపు సందడి చేసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటారు.. నిన్నటి వీకెండ్ కు కూడా 'గద్దలకొండ గణేష్' తరుపున మెగా ప్రిన్స్ 'వరుణ్ తేజ్' వచ్చి తన మూవీ ప్రమోట్ చేసుకున్నాడు. ఇక వచ్చేవారం...అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'సైరా' చిత్ర యూనిట్ కూడా బిగ్ బాస్ షో కి రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కావాల్సినంత ప్రమోషన్ జరుగుతున్నా..నాగార్జున మరియు చిరంజీవి కి మధ్య ఉన్న అనుబంధం తో  బిగ్ బాస్ లో మెగాస్టార్ సందడి చేస్తాడని టాక్.

 

అయితే 'సైరా' టీం తరుపున సురేందర్ రెడ్డి వస్తాడని కొంతమంది.. ఏకంగా 'మెగాస్టార్ చిరంజీవి' తన సినిమా ప్రమోషన్ కోసం రావొచ్చు అని ఇంకొంత మంది అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ కు వీకెండ్స్ వస్తే టీఆర్ఫీ అదిరిపోతుంది .. ఇక ఈ వారం మెగాస్టార్ ఎంట్రీ తో టీఆర్ఫీ పగిలిపోవడం కాయం. మరి 'సైరా' టీం ఎలా సర్ప్రైజ్ చేస్తారో వేచి చూద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS