రాహుల్‌ 'బిగ్‌' పర్‌ఫామెన్స్‌: పప్పులో కాలేసిన హౌస్‌మేట్స్‌!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3కి సంబంధించి మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అంటే రాహుల్‌ పేరే చెప్పుకోవాలి. మొదటి నుండీ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో రాముడు మంచి బాలుడు అనేలా హుందాతనం చాటుకుంటున్నాడు. అయితే, ఆ మంచితనంతోనే టాస్క్‌ల్లో అన్ని సందర్భాల్లోనూ కంఫర్ట్‌గా మూవ్‌ కాలేకపోతున్నాడు. ఆ కారణంగా టాస్క్‌ల్లో విఫలమవుతున్నాడన్న ట్యాగ్‌ వేయించుకున్నాడు. ఇక లేటెస్ట్‌గా బిగ్‌బాస్‌ ఇచ్చిన 'సీక్రెట్‌ లైస్‌' టాస్క్‌లో రాహుల్‌ పర్‌ఫామెన్స్‌ ఇరగదీసేశాడు.

 

కన్‌ఫేషన్‌ రూమ్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేసి, బయటికొచ్చి, మిగిలిన హౌస్‌మేట్స్‌కి చెప్పాలి. అయితే, వారు చెబుతుంది నిజమా? కాదా? అని గెస్‌ చేయాలి మిగిలిన హౌస్‌మేట్స్‌. వారి గెస్‌ కరెక్టే అయితే, డిన్నర్‌ పార్టీ ఫ్రీ అని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చారు. అలా అందరూ ఒక్కొక్కరుగా కన్‌ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు పూర్తి చేశారు. చాలా వరకూ హౌస్‌మేట్స్‌ గెస్‌ కరెక్ట్‌ అయ్యింది. ఒక్క రాహుల్‌ విషయంలో తప్ప. రాహుల్‌కి 50 సిట్‌ అప్స్‌ చేసి, 10 యాపీ ఫిజ్‌లు తాగమని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చారు.

 

కానీ, బయటికి వెళ్లాక, మమ్మీతో మాట్లాడాననీ, తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ, పెళ్లి కూడా నిశ్చయమైందనీ అబద్దం చెప్పమన్నాడు. రాహుల్‌ బిగ్‌బాస్‌ చెప్పినట్లుగానే, తనదైన పర్‌ఫామెన్స్‌ ఇచ్చి హౌస్‌మేట్స్‌ని నమ్మించాడు. రాహుల్‌ పర్‌ఫామెన్స్‌కి ఫ్లాట్‌ అయిపోయిన హౌస్‌మేట్స్‌ నిజమే అని ఒప్పుకున్నారు. అయితే, కొందరు ఇది అబద్ధం అని గెస్‌ చేసినా, శ్రీముఖి అత్యుత్సాహంతో మిగిలిన వాళ్లు కూడా నమ్మాల్సి వచ్చింది. అలా రాహుల్‌, ఫస్ట్‌టైమ్‌ టాస్క్‌లో తన పర్‌ఫామెన్స్‌తో హౌస్‌మేట్స్‌ని ఇంప్రెస్‌ చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS