'బిగ్‌' ఫైట్‌: వరుణ్‌కి అడ్డంగా దొరికేసిన శ్రీముఖి!

మరిన్ని వార్తలు

హౌస్‌కి చంద్రముఖిగా శ్రీముఖి డామినేషన్‌ మొదటి నుండీ కనిపిస్తూనే ఉంది. తన నోటితో అందర్నీ భయపెట్టేస్తూంటుంది శ్రీముఖి. అలాగే హోస్ట్‌ నాగార్జున వైపు నుండి కూడా శ్రీముఖికి ఫుల్‌ సపోర్ట్‌ ఉందనీ, ఆమె చేసినవి తప్పులైనా, వాటిని ఎత్తి చూపే ప్రయత్నం హోస్ట్‌ నాగార్జున చేయడం లేదనే వాదన కూడా సోషల్‌ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఇదే అదునుగా తీసుకుని హౌస్‌లో శ్రీముఖి ఆగడాలు మరింత ఎక్కువైపోతున్నాయంటున్నారు బిగ్‌బాస్‌ ప్రేమికులు.

 

తాజాగా హౌస్‌లో శ్రీముఖి ప్రవర్తనను తప్పు పట్టిన వరుణ్‌ సందేశ్‌ ఆమెతో ఫైట్‌కి దిగాడు. 'సీక్రెట్‌ లైస్‌' టాస్క్‌కి సంబంధించి రాహుల్‌ విషయంలో శ్రీముఖి చాలా ఓవరాక్షన్‌ చేసింది. రాహుల్‌ చెప్పిన అబద్ధాన్ని నిజమా.? కాదా.? అని గెస్‌ చేసే క్రమంలో శ్రీముఖి నిజమని వాదించింది. శ్రీముఖితో పాటు మరో ఒకరిద్దరు మాత్రమే దీన్ని నిజమని నమ్మారు. వరుణ్‌ తదితరులు అబద్ధమనుకున్నారు. కానీ, మెజారిటీ లేదనే కారణంతో 'బొక్కడిపోద్ది' అనే బూతు మాట వాడి, శ్రీముఖి మిగిలిన హౌస్‌మేట్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసింది. దాంతో మరికొంతమంది శ్రీముఖితో ఏకీభవించాల్సి వచ్చింది. కానీ, ఆ గెస్‌ రాంగ్‌ అయ్యింది. ఈ సందర్భంలో 'బొక్కడిపోద్ది..' అనే మాటను తప్పు పడుతూ వరుణ్‌ సందేశ్‌ తగులుకున్నాడు. చిన్నగా స్టార్ట్‌ అయిన ఈ రాద్ధాంతం పెద్దదైంది.

 

చివరికి నా లాంగ్వేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ అంతే.. అంటూ తన మార్క్‌ అరుపులతో వరుణ్‌పై విరుచుకుపడింది. అదే రాహుల్‌ విషయంలో అయితే, ఆ బాడీ లాంగ్వేజ్‌ని తప్పు పట్టేస్తావా.? నీకో న్యాయం, రాహుల్‌కి ఓ న్యాయమా.? అంటూ వరుణ్‌ ఊరుకోలేదు. ఈ డిస్కషన్‌ తాజా ఎపిసోడ్‌లో కొంత ఆసక్తి కనబరించింది. కరెక్ట్‌ పాయింట్‌ పట్టుకుని శ్రీముఖి నోటికి వరుణ్‌ భలే తాళమేశాడే.. అంటూ సోషల్‌ మీడియాలో వరుణ్‌ సందేశ్‌ని తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS