మంచి వాళ్లకే ఎక్కువ కత్తి పోట్లు.. అంటూ ఏదో సామెత చెబుతారు మన పెద్దోళ్లు. అలాగే బిగ్ హౌస్‌లో కూడా మంచి అనే ముద్ర ఉన్న రాహుల్, మహేష్‌లపైనే మిగిలిన హౌస్ మేట్స్ దృష్టి పెట్టారు. వారిని ఎలాగోలా బ్లేమ్ చేయాలని కత్తి కట్టినట్లున్నారు. పుల్లలు పెడతాడు.. అనే మాటతో హౌస్‌లో చాలా చాలా పెయిన్ అనుభవిస్తున్నాడు మహేష్. అలాగే రీజన్‌లెస్‌గా ఎవ్రీ వీక్ నామినేషన్‌లో ఉంటున్న రాహుల్ కూడా ఓ రకమైన ప్రెజర్ ఫీలవుతున్నాడు.
నవ్వే అతనికి బలం. కానీ, ఆ నవ్వే రాహుల్‌కి చేటు తెచ్చిపెడుతుందంటే, అంతకన్నా మించిన బాధ ఇంకేముంటుంది చెప్పండి. దోస్త్‌లు అనుకున్న వారే హౌస్‌లో తనకు అన్యాయం చేస్తున్నారు. మహేష్ అంటే, కొందరికి అస్సలు పడడం లేదు హౌస్‌లో. అలా హౌస్‌లో పూర్తిగా తమ ప్రమేయం లేకుండా ఎక్కువ సఫర్ అవుతున్నారు వీరిద్దరూ. ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దూరి పుల్లలు పెడుతున్నాడన్న వాదనపై మహేష్‌నీ, రాహుల్ సంగతి సరే సరి. ఎక్కువ తింటాడు. అందరితో కలిసిపోయి సరదాగా ఉంటాడు.. లాంటి సిల్లీ రీజన్స్‌తో హౌస్‌మేట్స్ నుండి ఎక్కువ కంప్టైంట్స్ వచ్చిన వీరిద్దరికీ బిగ్‌బాస్ కూడా శిక్ష విధించారు.
తక్షణమే జైలుకు పంపించాలని కెప్టెన్ శివజ్యోతికి ఆదేశమిచ్చారు. దాంతో వీరిద్దరూ జైలుకెళ్లాల్సి వచ్చింది. జైల్లో ఒకరికొకరు తమ తమ బాధలను పంచుకున్నారు. ఈ లోగా, లివింగ్ ఏరియాలో మిగిలిన హౌస్ మేట్స్ అంతా కలిసి ఎంజాయింగ్ మూడ్‌లో కనిపించారు. రాహుల్, మహేష్ హౌస్‌లో లేకుండా ఉంటేనే మంచిదన్నట్లుగా భావించినట్లుంది వీరి ప్రవర్తన. చూడాలి మరి, ఈ వింత ప్రవర్తనతో తదుపరి హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.