రాహుల్‌.. వై దిస్‌ కొల'వెర్రి'!

మరిన్ని వార్తలు

నిజాలు మాట్లాడేస్తూ, నిజాయితీగా ఉంటూ, జన్యూన్‌గా మాత్రమే ఆటాడుతా.. అంటే బిగ్‌బాస్‌లో చెల్లుతుందా.? చెప్పండి. సమయానికి తగ్గట్లు మారిపోవాలంతే. దటీజ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ స్ట్రాటజీ. బట్‌ రాహుల్‌ మాత్రం తానెలా ఉంటాడో అలాగే ఉంటున్నాడు. మరీ జన్యూన్‌గా ఉంటున్నాడు. తనకు ఏది అనిపిస్తే, అది అంటాడు. ఎలా అనిపిస్తే, అదే చేస్తాడు. నిజంగా ఓ మంచోడు రాహుల్‌. అతి మంచితనం కారణంగా అందరికీ టార్గెట్‌ అవుతున్నాడు.

 

ఆఖరికి దోస్తానా.. అంటూ తిరిగే వరుణ్‌, వితిక, పునర్నవిలకు కూడా బ్యాడ్‌ అయిపోతున్నాడు. ఇక హౌస్‌లో ఈగ చచ్చిపోతే, ఆ మర్డర్‌ చేసింది రాహులే.. అని ఆరోపించేంతలా రాహల్‌ పాలిట విలన్‌గా మారింది శ్రీముఖి. శ్రీముఖి వెనకే పాట పాడేందుకు హిమజ, అలీ తయారయ్యారు. అలా తన ప్రమేయం ఉన్నా, లేకున్నా, అన్ని తప్పులకూ తానే కేంద్ర బిందువవుతున్నాడు రాహుల్‌. తప్పు చేస్తే తనదే తప్పు అని ఒప్పేసుకుంటాడు. తాను బలైపోయినా, ఎదుటి వారిని సేవ్‌ చేయాలనుకుంటాడు. తన కన్నా, తనతో పాటు జైలు శిక్షననుభవించిన రవికృష్ణ కోసం ఎక్కువగా బాధపడిపోయాడు. కెప్టెన్సీకి అనర్హులు అని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చేసిన్పుడు కూడా నేనంటే అనర్హున్ని కానంటే ఒప్పుకుంటాను.. కానీ, రవికి ఏం తక్కువ.. అని రవిని సపోర్ట్‌ చేస్తూ మాట్లాడాడు.

 

ఆట కోసం తన క్యారెక్టర్‌ ఎలా బ్యాడ్‌ చేసుకుంటానంటూ, తనకంటూ ఓ బోర్డర్‌ ఏర్పర్చేసుకున్న రాహుల్‌పై బిగ్‌బాస్‌ ప్రేమికులకు ఎక్కడ లేని సింపతీ వచ్చేస్తోంది. సింపతీ సరే, తన వ్యక్తిత్వంతో వీక్షకుల మనుసల్ని ఎప్పుడో గెలిచేశాడు, గెలిచేస్తూనే ఉన్నాడు రాహుల్‌. కానీ, రాహుల్‌లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు బిగ్‌బాస్‌ గేమ్‌ షోకి నిజంగా అనర్హులే.. అనే అభిప్రాయం కూడా వీక్షకుల్లో వ్యక్తమవుతోంది. మరి రాహుల్‌ తన తీరు మార్చుకుంటాడా.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS