'రాములో రాములా..' రాహుల్‌ మిస్సయ్యాడే ఇలా.!

By Inkmantra - November 14, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

'అల వైకుంఠపురములో..' రాములో రాములా.. పాట ఈ మధ్య సెన్సేషన్‌ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ పాట బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడాలంట. కానీ, బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కారణంగా రాహుల్‌ ఆ పాటను మిస్‌ అయ్యాడు. రాహుల్‌ గురించి తెలిశాక, ఆ పాట రాహుల్‌ గొంతులో పడి ఉంటే, ఇంకా చాలా బాగుండేదని పాట రిలీజయ్యాక రాహుల్‌ అభిమానులు, ఆ మాటకొస్తే, సంగీత ప్రియులంతా అభిప్రాయపడ్డారు. ఈ పాటని రాహుల్‌తో పాడించేందుకు 'అల..' టీమ్‌ కూడా చాలా ట్రై చేసిందట. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ బిగ్‌బాస్‌ టీమ్‌ని రిక్వెస్ట్‌ చేశాడట కూడా. ఒక్క అరగంటయినా రాహుల్‌కి ఛాన్సివ్వమని కోరాడట.

 

బన్నీ కూడా రాహుల్‌నే సూచించాడట ఈ పాట కోసం. కానీ, బిగ్‌బాస్‌ రూల్స్‌ ప్రకారం రాహుల్‌ని బయటికి పంపించడం సాధ్యపడదని చెప్పడంతో, అలా ఆ పాటను రాహుల్‌ మిస్సయ్యాడు. కానీ, పాట వింటున్నప్పుడల్లా రాహుల్‌ని తలచుకోకుండా ఉండలేకపోతున్నారు ఆడియన్స్‌. ఇంతవరకూ చాలా హిట్‌ సాంగ్స్‌ పాడిన రాహుల్‌కి బిగ్‌బాస్‌ కారణంగా ఈ పాపులర్‌ సాంగ్‌ మిస్సయ్యింది. అయినా, కోట్లాది మంది ఆదరణ దక్కింది.. అంటే, అది బిగ్‌బాస్‌ వల్లే సాధ్యపడింది. తనను గెలిపించి, తనపై ఇంతటి ఆదరాభిమానాలు కురిపించిన ఆడియన్స్‌ కోసం ఈ నెల 30న హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా లైవ్‌ కాన్సెర్ట్‌ చేయబోతున్నాడట రాహుల్‌ సిప్లిగంజ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS