రాహుల్‌కి వార్నింగ్‌, శ్రీముఖికి లైకింగ్‌!

మరిన్ని వార్తలు

కాకి పిల్ల కాకికి ముద్దు. అలాగే ఎవరి పిల్లలనయినా పేరెంట్స్‌ ముద్దుగానే పెంచుకుంటారు. శ్రీముఖిని శ్రీముఖి తల్లయినా, రాహుల్‌ని రాహుల్‌ తల్లయినా. ఇంటి సభ్యుల్ని లోపలికి పంపే క్రమంలో చివరిగా రాహుల్‌ తల్లి సుధారాణి, శ్రీముఖి తల్లి లత ఎంట్రీ ఇచ్చారు. రాహుల్‌ మదర్‌ సుధారాణి చాలా హుందాగా వ్యవహరించింది. మా పిల్లాడు తెలిసీ, తెలియక ఏమైనా నోరు జారితే, నా తరపున రాహుల్‌ని క్షమించండి.

 

రాహుల్‌ చాలా మంచోడు. మనసులో ఏదీ ఉంచుకోడు.. అంటూ తన కొడుకు చేసిన తప్పు ఒప్పులకు తన పెద్దరికాన్ని పక్కన పెట్టి, హౌస్‌ మేట్స్‌ అందర్నీ క్షమాపణలు కోరింది. అదీ పెద్దరికం అంటే. ఏ.. ఆమె కూడా హౌస్‌లో తన కొడుకును అనవసరంగా నిందిస్తున్న శ్రీముఖి తదితరుల్ని ఎందుకు ఓ ఆట ఆడుకోలేదు. అవకాశం ఆమెకు కూడా ఉంది కదా.! కానీ అలా చేయలేదు. శ్రీముఖి అంటే చాలా ఇష్టం. నీ అల్లరి అంటే ఇష్టం.. అంటూ పొగడ్తలు కురిపించింది. రాహుల్‌కి అంతటి హుందాతనం ఎందుకొచ్చిందో తల్లి సుధారాణిని చూస్తే అర్ధమవుతుంది. ఇక శ్రీముఖి తల్లి విషయానికి వస్తే, రాహుల్‌కి హౌస్‌లో శ్రీముఖి పెట్టే టార్చర్‌ చాలదన్నట్లు, గెస్ట్‌లా వచ్చిన శ్రీముఖి తల్లి కూడా రాహుల్‌ని ఓ ఆట ఆడేసుకుంది.

 

అందరి ముందూ రాహుల్‌ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసింది. శ్రీముఖితో పోట్లాడొద్దు.. అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. నిజంగానే ఇది పేరెంట్స్‌ ఒపీనియనో.? లేక బిగ్‌బాస్‌ స్క్రిప్టులోని భాగమేనో తెలీదు కానీ, శ్రీముఖి తల్లి లత చేసిన ఓవరాక్షన్‌కి నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఒకవేళ ఇది బిగ్‌బాస్‌ స్క్రిప్టే అయితే, కంటెస్టెంట్స్‌తో పాటు, వారి తల్లితండ్రుల్ని కూడా తిట్టించే ప్రక్రియగా దీన్ని భావించాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS