ఫ్యామిలీ హీరోగా అలరించిన శ్రీకాంత్ పెద్ద తనయుడు రోషన్ 'నిర్మలా కాన్వెంట్' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. శ్రియా శర్మ ఈ సినిమాలో రోషన్‌కి జంటగా నటించింది. అయితే, ఈ సినిమాతో రోషన్ హీరోగా ఏం సాధించాడనేది పక్కన పెడితే, హీరోగా డెబ్యూ అయితే జరిగిపోయింది.
ఇక ఇప్పుడు శ్రీకాంత్ రెండో తనయుడు వస్తున్నాడు. అన్న క్యూట్ లవ్ స్టోరీతో వస్తే, తమ్ముడు భయపెట్టేస్తానంటూ హారర్ మూవీతో వస్తున్నాడు. 'అభినేత్రి' సిరీస్ సినిమాలతో హారర్ హిట్స్ అందుకున్న ప్రభుదేవా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మమతా మోహన్‌దాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభుదేవా, మమతా మోహన్‌దాస్‌కి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు శ్రీకాంత్ చిన్న కొడుకు. 'వూమై ఇచ్చిగల్' టైటిల్‌తో తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని హారర్ ఎలిమెంట్స్ స్పెషల్ కిక్ ఇవ్వనున్నాయట.
ఇంతవరకూ ప్రభుదేవా నటించిన హారర్ సినిమాల కన్నా ఈ చిత్రం భిన్నంగా ఉంటుందట. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. లవర్ బోయ్‌గా డెబ్యూ చేసి, ఆకట్టుకున్న శ్రీకాంత్ పెద్ద తనయుడు మళ్లీ ఇంకో సినిమాలో కనిపించలేదు. మరి, వస్తూ వస్తూనే భయపెడతానంటోన్న చిన్న కొడుకు ఏం చేస్తాడో చూడాలి మరి.