ప్ర‌మోష‌న్లు ఓ రేంజ్‌లో...

By Gowthami - January 21, 2020 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

చిన్న సినిమానైనా స‌రే... భారీ ప్ర‌మోష‌న్లు త‌ప్ప‌ని స‌రి. లేదంటే జ‌నంలోకి వెళ్ల‌డం చాలా క‌ష్టం. ఈ విష‌యంలో ఆరి తేరిపోయిన నిర్మాత రాజ్ కందుకూరి. పెళ్లి చూపులు సినిమాకి ఆయ‌న చేసిన ప్ర‌మోష‌న్ .. చిన్న సినిమాల‌కు ఓ మార్గ‌ద‌ర్శ‌నంగా నిలిచింది. మెంట‌ల్ మ‌దిలో సినిమా స‌మ‌యంలోనూ ఆయ‌న కొత్త పోక‌డ‌లు అవ‌లంభించారు. ఆ చిత్ర విజ‌యాల్లో ప్ర‌మోష‌న్ల‌దీ పెద్ద పాత్రే. ఇప్పుడు త‌న త‌న‌యుడి చిత్రానికీ అదే స్థాయిలో ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు.

 

రాజ్ కందుకూరి త‌నయుడు శివ కందుకూరి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `చూసీ చూడంగానే`. శేష సింధూరావు ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. వ‌ర్ష‌, మాళ‌విక క‌థానాయిక‌లు. ఈనెల 31న విడుద‌ల అవుతోంది. ఈలోగా ప్ర‌మోష‌న్లు జోరందుకున్నాయి. చిత్ర‌బృందం ఓ ప్ర‌మోష‌న‌ల్ టూర్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ని చిత్ర‌బృందం ప‌ర్య‌టిస్తోంది. ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కెళ్లి, త‌మ సినిమాల‌కు ప్ర‌చారం క‌ల్పిస్తున్నారుమంగ‌ళ‌వారం వీవీఐటీ కాలేజీని సంద‌ర్శించిన చిత్ర‌బృందం అక్క‌డి విద్యార్థుల‌తో స‌ర‌దాగా గ‌డ‌దిపింది. . విడుద‌లైన త‌ర‌వాత‌.. టాక్‌ని బ‌ట్టి జ‌నంలోకి వెళ్తుంటుంది చిత్ర‌బృందం. అయితే కాస్త ముందుగానే ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌డం చూస్తుంటే, ఈ సినిమాపై ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో అర్థ‌మ‌వుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS