ప‌వ‌న్‌... క్రిష్‌.. ముహూర్తం ఫిక్స్.

By Gowthami - January 21, 2020 - 18:03 PM IST

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచాడు. నిన్న‌నే పింక్ రీమేక్ మొద‌లెట్టిన ప‌వ‌న్‌.. ఇప్పుడు క్రిష్ సినిమాకీ ప‌చ్చ‌జెండా ఊపేశాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. ఈ సినిమా కొబ్బ‌రికాయ కొట్టుకోవ‌డానికి రంగం సిద్ధ‌మైంది. ఈనెల 27న ముహూర్తం నిర్ణ‌యించారు. ఆరోజే పవ‌న్ - క్రిష్ చిత్రానికి శ్రీ‌కారం చుడ‌తారు. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు పూర్త‌య్యింది.

 

మొగ‌లాయిల ప‌రిపాల‌నా కాలానికి సంబంధించిన క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా సెట్స్‌ని రూపొందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఉంటార‌ని తెలుస్తోంది. వారిలో ఒక‌రిని బాలీవుడ్ నుంచి దిగుమ‌తి చేసుకుంటార‌ని స‌మాచారం. ప్ర‌తినాయ‌కుడి పాత్ర కోసం కూడా ఓ బాలీవుడ్ స్టార్ పేరుని ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు తెలిసే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS