రాజ్‌తరుణ్‌కి తప్పిన పెను ప్రమాదం.

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోమెటిక్‌ గేర్‌ సిస్టమ్‌ కావడంతో, అందులోని సాంకేతికతను అర్ధం చేసుకోలేక కంగారు పడిన రాజ్‌తరుణ్‌, అతివేగంలో అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టాడు. దాంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ఆయన ప్రమాదం నుండి బయట పడ్డాడు.

 

అయితే, ఆ తరుణంలో రాజ్‌తరుణ్‌ మధ్యం సేవించి ఉన్నాడంటూ మొదట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదనీ, అతి వేగాన్ని కంట్రోల్‌ చేయలేకనే కారు అదుపు తప్పిందనీ పోలీసుల ధర్యాప్తులో వెల్లడైంది. నార్సింగిలోని, అల్కాపూర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుండి రాజ్‌తరుణ్‌ పరుగెడుతూ, వేరే కారులో వెళ్లిపోవడాన్ని అక్కడి సీసీ టీవీ పుటేజ్‌ చిత్రీకరించింది.

 

ఇదిలా ఉంటే, ఈ మధ్య రాజ్‌తరుణ్‌ సినిమాలు లేక ఖాళీగానే ఉంటున్నాడు. అయితే, ఇటీవలే ఓ సినిమాకి సైన్‌ చేశాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని వస్తుండగానే ఈ ఘటన జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌. మొత్తానికి ఎటువంటి ప్రమాదం లేకుండా, రాజ్‌ తరుణ్‌ ఈ దుర్ఘటన నుండి బయటపడడం సంతోషించదగ్గ అంశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS