కిట్టుగాడి పెళ్లి : కండిషన్స్‌ అప్లై

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. డైరెక్టర్‌ అవుదామనుకుని వచ్చి, హీరోగా సెటిలైపోయాడు ఈ యంగ్‌ హీరో. అయితే తాజాగా మనోడ్ని పెళ్లెప్పుడు చేసుకుంటావురా నాయనా అని అడుగుతున్నారట అంతా. అందుకు మనోడు చిలిపిగా సమాధానం చెప్పాడు. అందుకు ఇంకా చాలా టైం ఉంది. అయితే 2019కల్లా క్లారిటీ రావచ్చు అన్నాడట. అలాగే రాజ్‌తరుణ్‌కి చాలా బాధ్యతలు కూడా ఉన్నాయట. ఇంకా తన కన్నా పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పెళ్లి అయినాకే నా పెళ్లి అంటున్నాడు. అలాగే గతంలో యాంకర్‌ లాస్యతో పెళ్లయిపోయిందంటూ గాసిప్స్‌ వచ్చాయి. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లయిపోయింది. ఎక్కడో ఒక ఆడియో ఫంక్షన్‌లో కలిశాను ఆ అమ్మాయిని. అందుకే ఇంత పెద్ద రూమర్‌ క్రియేట్‌ చేసేశారు. అదే నా లైఫ్‌లో చాలా బాధాకరమైన సంఘటన అన్నాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. రేపే ఈ సినిమా విడుదల. అనూ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ అదరగొట్టేశాడట మన కిట్టుగాడు ఈ సినిమాలో. ఆకెళ్ల వంశీ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కుక్కల్ని కిడ్నాప్‌ చేసే కుర్రాడిగా రాజ్‌ తరుణ్‌ నటిస్తున్నాడు ఈ సినిమాలో. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS