'బాహుబలి' టైంలోనే జక్కన్న తన తదుపరి సినిమా ఎలా ఉండాలో ప్లాన్ చేసేశాడట. అది ఏ హీరోతో ఉండాలో కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడట. 'బాహుబలి' సినిమాకి దాదాపు ఐదేళ్లు టైం తీసుకున్న రాజమౌళి, ఈ సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్ పని మీదే కాన్‌సన్‌ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా దేశం గర్వించదగ్గ సినిమాగా గుర్తింపు పొందింది.
సరే.. తాజాగా రాజమౌళి నుండి రాబోయే చిత్రంపై ఇప్పుడు ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమౌళి తన ట్విట్టర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేయడంతో స్టార్ట్ అయ్యాయి ఈ ఊహా గానాలు. అయితే ఈ ఇద్దరితో రాజమౌళి మల్టీ స్టారర్ తెరకెక్కించబోతున్నాడన్న విషయం దాదాపుగా ఖరారైనట్టేనని టాక్ అయితే బాగా ప్రచారం అవుతోంది. ఇక అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది మరి. అయితే ఈ సినిమాకి రాజమౌళి ఎప్పుడో స్కెచ్ వేసినట్లే తెలుస్తోంది. తన తదుపరి సినిమాలో గ్రాఫిక్స్ ఉండవనీ అప్పుడే చెప్పాడు జక్కన్న.
అలాగే చిన్న సినిమా అయితే మాత్రం కాదని కూడా రాజమౌళి అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడు. అదే నిజం కానుందని తెలుస్తోందిప్పుడు. ఈ మల్టీ స్టారర్‌కి కథనందిస్తున్నది రాజమౌళి తండ్రి ది గ్రేట్ రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌లు అన్నదమ్ముల్లా నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతోందట. 'సై' చిత్రంతో 'రబ్బీ' అనే ఆటని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాజమౌళి. అయితే ఈ సినిమా కోసం బాక్సింగ్‌ని ఎంచుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారమ్.
ప్రస్తుతం చరణ్ 'రంగస్థలమ్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లోనే విడుదల కానుంది. మరో పక్క ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు.