రాజ‌మౌళిని ఢీ కొట్ట‌డానికి రెడీనా?

మరిన్ని వార్తలు

2021 సంక్రాంతికి `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 8న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. మ‌రోవైపు శంక‌ర్ `భార‌తీయుడు2` కూడా పండ‌క్కే వ‌స్తోంది. సో.. వీటి మ‌ధ్య న‌లిగిపోవ‌డానికి ఏ సినిమా సిద్ధంగా లేదు. సంక్రాంతికి వ‌ద్దామ‌ని రెడీ అవుతున్న కొన్ని సినిమాలు సైతం.. విడుద‌ల తేదీ మార్చుకుంటున్నాయి. అయితే రాజ‌మౌళి సంగ‌తి తెలిసి కూడా ఓ సినిమా సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి సిద్ధ‌మైంది. అదే `ఎఫ్ 3`. వెంక‌టేష్‌. వ‌రుణ్‌తేజ్ లు క‌ల‌సి న‌టించిన `ఎఫ్ 2`.. 2019 సంక్రాంతికి విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అప్పుడే ఎఫ్ 3 కూడా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. అందుకు సంబంధించిన స్క్రిప్టు ప‌నులు మొద‌లైపోయాయి కూడా.

 

2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు దిల్ రాజు వ్యూహాలు ర‌చిస్తున్నారు. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్లు బాగా ఆడుతుంటాయి. పైగా మ‌ల్టీస్టార‌ర్ అంటే ఆ క్రేజే వేరు. సెంటిమెంట్ ప‌రంగా చూసినా, సంక్రాంతి దిల్ రాజుకి బాగా క‌లిసొచ్చింది. అందుకే.. 2021 సంక్రాంతినీ వ‌ద‌ల‌కూడ‌ద‌ని ఆయ‌న ఫిక్స్ అయ్యార్ట‌. ఎఫ్ 3లో న‌టించే మూడో హీరో ఎవ‌రన్న విష‌యంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అదొచ్చేస్తే గ‌నుక‌.. సినిమా సెట్స్‌పైకి వెళ్లిపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS