సమస్యే లేదు తగ్గనంటోన్న జక్కన్న!

మరిన్ని వార్తలు

రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఇద్దరు స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్టార్స్‌కి సరిపడా స్టార్‌ హీరోయిన్స్‌ కోసం జక్కన్న టాలీవుడ్‌ని అస్సలు టచ్‌ చేయలేదు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ రేంజ్‌లో ఆలోచించాడు. బాలీవుడ్‌ నుండి అలియాభట్‌ సెట్టయ్యింది కానీ, హాలీవుడ్‌ నుండి సెట్టయిన డైసీ మధ్యలో హ్యాండివ్వడంతో ఆ ప్లేస్‌ని భర్తీ చేయడం జక్కన్నకు కత్తి మీద సామే అయ్యింది. దాంతో జక్కన్న కాంప్రమైజ్‌ అయ్యి టాలీవుడ్‌ భామలపై పోనీ, బాలీవుడ్‌లో మిగిలిన స్టార్‌ హీరోయిన్లపై దృష్టి పెడతాడేమో అనుకున్నారు.

 

కానీ, జక్కన్న మాత్రం ఎక్కడా కాంప్రమైజ్‌ కానంటున్నాడు. హాలీవుడ్‌ నుండే మరో భామని దిగుమతి చేస్తానని ఒంటి కాలిపై తపస్సు చేస్తున్నాడు. క్యారెక్టర్‌ పరంగా ఎన్టీఆర్‌ విదేశీ భామని ప్రేమిస్తాడు. అందుకోసం విదేశీ భామనే ఎంచుకోవాలని పట్టు పడుతున్నాడు జక్కన్న. అయితే విదేశీ ఫీచర్స్‌ తీసుకురావడం మన సౌత్‌ భామల్లో కాస్త కష్టమే అయినా, బాలీవుడ్‌లో ట్రై చేయొచ్చు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నో కాంప్రమైజ్‌ అంటున్న జక్కన్న కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

 

ఓ పక్క హీరోయిన్‌ వేట కొనసాగుతూనే ఉంది. మరోపక్క సినిమా షూటింగ్‌ జరుగుతూనే ఉంది. చరణ్‌, ఎన్టీఆర్‌ గాయాల తర్వాత ఇటీవలే సెట్స్‌ మీదికెళ్లిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా హైద్రాబాద్‌ శివార్లలో వేసిన సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌, తమిళ నటుడు కమ్‌ దర్శకుడు సముద్ర ఖని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దానయ్య నిర్మాణంలో కీరవాణి మ్యూజిక్‌ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS