తేజుతో మారుతి ఏం చేయిస్తాడో!

By iQlikMovies - May 23, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

హీరోకి 'మతిమరుపు' అనే లోపం పెట్టి దర్శకుడు మారుతి నేచురల్‌ స్టార్‌ నానితో బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇదేదో బాగుంది కదా అని తర్వాతి సినిమాలోనూ హీరోకి లోపం పెట్టాడు. అదే 'అతిశుభ్రం'. ఈ లోపంతో శర్వానంద్‌కి హిట్‌ ఇచ్చాడు. ఇక ఇదే ఫార్ములా కంటిన్యూ చేస్తూ మూడో సినిమాలో హీరోయిన్‌కి ఈగో అనే లోపం పెట్టాడు. కానీ, ఈ ఫార్ములా బెడిసికొట్టేసింది. అయితే, ఇప్పుడు మారుతి మెగా మేనల్లుడు తేజుతో సినిమా తెరకెక్కించబోతున్నాడు.

 

ఈ సినిమాలో కూడా హీరోకి కానీ, హీరోయిన్‌కి కానీ ఏదైనా లోపం పెడతాడా.? లేక విలన్‌పై ఈసారి దృష్టి పెడతాడా.? అనేది ఆశక్తిగా మారింది. అయితే, ఈ ఫార్ములాని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా కాకుండా, ఇంకాస్త డిఫరెంట్‌గా ఏదో ప్లాన్‌ చేశాడట. అసలే తేజు 'చిత్రలహరి'తో హిట్‌ కొట్టి ఉన్నాడు. ఈ హిట్‌ని కంటిన్యూ చేయాల్సిన అవసరముంది. మరి మారుతి ప్రయోగం తేజుని సక్సెస్‌ వైపు నడిపిస్తుందో లేదో చూడాలిక. 'చిత్రలహరి'లో కాస్త బొద్దుగా కనిపించిన తేజు, ఈ సినిమాలో లుక్స్‌ పరంగా మేకోవర్‌ కానున్నాడు. ఇప్పటికే వెయిట్‌ తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో సందడి చేయనున్నాడు తేజు ఈ సినిమాలో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS