రాజమౌళి డైరెక్షన్‌లో చరణ్‌?

మరిన్ని వార్తలు

రాజమౌళి - చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మగధీర' ఓ సెన్సేషన్‌. మళ్లీ ఈ సెన్సేషనల్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఇదో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. 1985 నాటి ప్రేమకథ. సమంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనున్నాడు చరణ్‌ ఈ సినిమాలో. ఇదిలా ఉండగా, వరల్ద్‌ వైడ్‌ సెన్సేషన్‌ అయిన 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి సినిమా సంగతి కూడా వెల్లడించలేదు ఇంతవరకూ. అయితే 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ నిజమే అయితే రాజమౌళి నుండి రాబోయే మరో సెన్సేషన్‌ అయ్యి తీరుతుంది ఈ సినిమా అని చెప్పక తప్పదు. మరో పక్క రామ్‌ చరణ్‌, చిరంజీవి 151వ సినిమా నిర్మాణ పనుల్లోనూ బిజీగానే ఉన్నారు. ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకం రామ్‌ చరణ్‌కి. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 'సైరా నరసింహారెడ్డి' అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇదే కాకుండా 'రంగస్థలమ్‌' సినిమా తర్వాత చరణ్‌, కొరటాల శివ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి రాజమౌళి - రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌ ఎప్పటికి పట్టాల్కెనుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS