ప్రముఖ దర్శకుడు రాజమౌళి లండన్ పయనమయ్యాడు. ఇదేదో తన కొత్త సినిమా పని కోసం కాదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ కంపెనీతో మీటింగ్ కి సీఆర్డీఏ అధికారులతో కలిసి వెళుతున్నారు. ఇప్పటికే ఈ డిజైన్ల పై తన అభిప్రాయం వ్యక్తం చేయడం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కూడా రాజమౌళి కలవడం జరిగింది.
ఇక ఆ కంపెనీ వారితో మాట్లాడి సదరు డిజైన్లకి తుది రూపు ఇచ్చేలా రాజమౌళి ప్రయత్నం చేయనున్నాడు. ఇందుకు గాను ఇప్పటికే కసరత్తు పూర్తీ చేసినట్టు సమాచారం.
ఈ మీటింగ్ తరువాత ఈ డిజైన్ల అంశం ఒక కొలిక్కి వచ్చేలా కనపడుతుంది.