యాక్సిడెంట్‌లో తనకు ఎలాంటి గాయాలూ కాలేదని రాజశేఖర్ స్పందించారు. ప్రమాదం సమయంలో కారులో తాను ఒక్కడినే ఉన్నాననీ, ప్రమాదం జరిగిన అనంతరం ఎదురుగా వస్తున్న కారులోని వారు ఆగి, కారులో ఉన్నది నేనే అని గుర్తించి విన్ షీల్డ్‌లో ఇరుక్కున్న నన్ను బయటికి లాగి రక్షించారనీ, ఆ తర్వాత వారి మొబైల్ నుండి పోలీసులకూ, కుటుంబ సభ్యులకూ సమాచారం అందించానని ఆయన తెలిపారు. వారి కారులోనే ఇంటికి బయలుదేరాననీ, ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు.
మంగళవారం రాత్రి రామోజీ ఫిలిం సిటీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందనీ, అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, కారులో ఆయన ఒక్కరే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్. 'గరుడవేగ' సినిమాతో లాంగ్ గ్యాప్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజశేఖర్ ఇటీవల 'కల్కి'తో మరో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు కోసం చర్చోపచర్చల్లో ఉన్నారు. కథలు వింటున్నారు. విలక్షణ కథలను ఎంచుకునే దిశగా రాజశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నారు.