రాజశేఖర్ - జీవిత దంపతుల చిన్న కుమార్తై శివాత్మిక నటించిన 'దొరసాని' చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజశేఖర్ ప్రసంగం ఎమోషనల్‌గా సాగింది. చిన్నతనం నుండీ తన కూతుళ్లు తననే చూస్తూ పెరిగారనీ, ఆయన ఇన్స్‌ప్రేషన్‌తోనే వారికి నటన పట్ల ఆశక్తి కలిగిందనీ ఆయన అన్నారు. అంతేకాదు, హీరోయిజం అనేది అంత తేలిగ్గా దక్కే విషయం కాదనీ, అందుకు చాలా చాలా కష్టపడాలనీ ఆయన అన్నారు.
తనకు దక్కిన ఆ హీరోయిజాన్ని నిలబెట్టుకునేందుకు 30 ఏళ్లుగా కష్టపడుతూ వస్తున్నాననీ, హీరో కావడానికి కెరీర్‌లో చాలా ఎత్తు పల్లాలు చూడాల్సి వచ్చిందనీ రాజశేఖర్ అన్నారు. అంతేకాదు, మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పని. ఇప్పుడు టాలెంట్‌తో పని లేదు, సక్సెస్ ఉంటే చాలు.. దాంతోనే నిలదొక్కేసుకోవచ్చు.. పరిస్థితి అలా మారిపోయింది అని ఇండస్ట్రీలో ప్రజెంట్ సిట్యువేషన్ గురించి ఆయన తెలిపిన వైనం అందర్నీ ఆకట్టుకుంది.
అంతేకాదు, ఒకవేళ సినిమా ఫెయిలైనా బాధపడాల్సిన పని లేదనే ధైర్యాన్ని కూడా ముందుగానే కూతురుకి రాజశేఖర్ నూరి పోసినట్లు కనిపిస్తోంది. అవును నిజమే, ఫెయిల్యూర్‌ని డైజెస్ట్ చేసుకోవడం అందరి వల్లా కాదు. కొందరు ఆ ప్రెజర్‌ని తట్టుకోలేరు. అందుకే ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ చేసి, రాజశేఖర్ తన కూతురుని రంగంలోకి దించినట్లున్నారు. ఆ కాన్ఫిడెన్స్ శివాత్మిక కళ్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'దొరసాని' జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.