వరంగల్‌ పోరగాళ్లను బుట్టలో వేసేసిన నభా!

మరిన్ని వార్తలు

వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో వరంగల్‌ పోరగాళ్ల ప్రత్యేక మెప్పు పొందింది ముద్దుగుమ్మ నభా నటేష్‌. ఇద్దరు భామలు స్టేజ్‌పై ఉంటే, ఆ మాటికొస్తే, ఇద్దరు కాదు, నభాతో పాటు, నిధి అగర్వాల్‌, ఛార్మి తదితర ముద్దుగుమ్మలుంటే, నభా మైక్‌ తీసుకుని మాట్లాడగానే వరంగల్‌ పోరగాళ్లు ఈలలు కేకలుతో రచ్చ రంభోలా చేశారు. ఈ రెస్పాన్స్‌కి స్టేజ్‌పై ఉన్నవారందనూ ఆశ్చర్యపోయారు. ఎన్నో సినిమాలు చేసి, బోలెడంత గ్లామర్‌ ఇమేజ్‌ ఉన్న 'పద్దూ ఆడ పులి..' అయిన ఛార్మికి కూడా అంత రెస్పాన్స్‌ రాలేదు వరంగల్‌ పోరగాళ్ల నుండి.

 

అంటే, ఎంతగా నభా నటేష్‌ ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవాలి. ట్రైలర్‌లో ఆమె చెప్పిన డైలాగ్‌ జనంలోకి బాగా ఎక్కేసినట్లుంది. విమర్శలు వచ్చినా, నభాకి ఇమేజ్‌ కూడా బాగానే తోడయ్యినట్లుంది ఆ డైలాగ్‌తో. ఇకపోతే, ఈ సినిమాలో నభా నటేష్‌ క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉన్నట్లు పూరీ మాటల ద్వారా అర్ధమవుతోంది. గ్లామర్‌కి గ్లామర్‌, పర్‌ఫామెన్స్‌కి పర్‌ఫామెన్స్‌ ఇలా డబుల్‌ డోస్‌లో నభా నటేష్‌ ఆకట్టుకోనుందని తెలుస్తోంది.

 

పూరీ జగన్నాధ్‌ డైరెక్షన్‌లో డబుల్‌ డోస్‌ మసాలా ఫ్లేవర్‌ కంటెంట్‌తో రూపొందుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మి, పూరీ జగన్నాధ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని 'ఇస్మార్ట్‌ శంకర్‌'గా పక్కా హైద్రాబాదీ కుర్రోడిగా మెప్పించనున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS