అత్యంత ప్రతిష్టాత్మకంగా నందమూరి బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం గురించిన విషయాలు ఒక్కొకటిగా బయటకివస్తున్నాయి.
అందులో తాజాగా ఒక ప్రముఖ హీరో ఈ బయోపిక్ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇంతకి ఆ పాత్ర ఏంటి అనేదాని పైన క్లారిటీ లేకపోయినప్పటికీ ఆ హీరో ఎవరనేది మాత్రం తెలిసింది. ఆ హీరో మరెవరో కాదు రాజశేఖర్.
మొన్న జరిగిన పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆయన గత చిత్రానికి బాలకృష్ణ పరోక్షంగా సహాయం చేసినదానికి కృతజ్ఞతగా వచ్చి ఉంటాడు రాజశేఖర్ అని అందరూ అనుకున్నారు. అయితే ఆ వేదిక పైనే మేము ఇద్దరు కలిసి చేస్తాము అన్న మాటని బాలయ్య ఇప్పుడు నిలబెట్టుకోనున్నాడు అని సమాచారం.
త్వరలోనే దీనికి సంబందించిన ప్రకటన చిత్ర యూనిట్ నుండి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా గరుడవేగ చిత్రంతో మంచి ఫాంలోకి వచ్చిన రాజశేఖర్ కి ఈ బయోపిక్ ఒక మంచి అవకాశామనే చెప్పాలి.