'గరుడవేగ' చిత్రంతో ఇటీవల హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి, మంచి విజయం అందుకున్న రాజశేఖర్ తాజా చిత్రానికి 'కల్కి' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 'అ' చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లేటెస్టుగా విడుదలైన 'కల్కి' టైటిల్‌ని బట్టి సినిమాపై అంచనాలు పెరిగాయి.
1983ల కాలం నాటి స్టోరీ ఇది. రాజశేఖర్ సరికొత్త పాత్ర పోషిస్తున్నాడు. 'అ' సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై కొన్ని రకాల అంచనాలున్నాయి. సినిమా హిట్టా? ఫట్టా? అనే సంగతి పక్కన పెడితే, తన సినిమాలో ఏదో కొత్తదనం చూపిస్తాడు ప్రశాంత్ వర్మ ఇది పక్కా.. అని ఆడియన్స్ భావిస్తున్నారు. హీరోగా నటిస్తూనే నిర్మాణ భాగస్వామ్యం కూడా వహిస్తున్నాడు రాజశేఖర్ ఈ సినిమాకి. ఈ సినిమాలో రాజశేఖర్ సరసన నటించబోయే ముద్దుగుమ్మ కోసం పరిశీలన జరుగుతోంది. తెలుగమ్మాయి అంజలి పేరును ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ క్లారిటీకి రానున్నారు.
ఇకపోతే ఈ మధ్య రాజశేఖర్ నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయ్యారు. సీనియర్ హీరోల సినిమాల్లో రాజశేఖర్ విలన్‌గా నటించే అవకాశాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ లోగా అనుకోకుండా 'గరుడవేగ' ప్రాజెక్ట్ రావడం, ఆ ప్రాజెక్టు అనూహ్యంగా సక్సెస్ కావడంతో హీరోగా బౌన్స్ బ్యాక్ అయిన రాజశేఖర్ ప్రస్తుతానికి ఆ ప్రపోజల్‌ని పక్కన పెట్టారట. కానీ త్వరలోనే ఓ పెద్ద సినిమాలో రాజశేఖర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.