రాజకీయాల్లోకి తలైవా వచ్చేస్తున్నాడు అంటూ పుఖార్లు షికారు చేస్తున్న వేళ రోజుకొక కోత్త అప్డేట్ వస్తున్నది.
లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం, రజినీకాంత్ తన కొత్త రాజకీయ పార్టీ జూలైలో ప్రకటించనున్నాడట! ఇప్పటికే తన అభిమానులతో ఒక దఫా చర్చలు ముగించిన రజిని, వచ్చే నెలలో కూడా ఇంకో దఫా చర్చలు జరపనున్నాడట.
అయితే ఇప్పటికే కొన్ని తమిళ సంఘాలు నుండి ఆయన తమిళనాడుకి చెందిన వాడు కాదని వాధనులు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు అయితే తమ పార్టీలలో చేరాలని కోరడం కూడా జరుగుతుంది.
మరి ఇలాంటి పరిస్థుతులలో ఆయన ఎటువైపు అడుగు వేస్తాడో అనేది వేచి చూడాలి.