తమిళనాట రాజకీయమంతా అక్కడ సినీ పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నది. దీనికి కారణం- రజినీకాంత్, కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఇక రావడమే కాకుండా ఏకంగా తన పార్టీ పేరు, జెండా, ఎజెండాని కూడా ప్రకటించేశాడు కమల్.
అయితే కమల్ హాసన్ పార్టీ ప్రకటన నేపధ్యంలో జరిగిన బహిరంగ సభ నేపధ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించాడు. రజిని మాట్లాడుతూ- తాను ఆ సభకి కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను అని అలాగే సభ మొత్తం చూసాను అని చెప్పాడు. అయితే తనకి కమల్ కి అభిప్రాయలు, ఆలోచనలు భిన్నం అని అయితే ఇద్దరం మాత్రం ప్రజలకి మంచి జరగాలని కొరుకునేవాళ్ళమే అని మనసులో మాట చెప్పేశాడు.
దీనితో ఈ ఇద్దరు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు అని అందుకుగానే రజినీకాంత్ ఇటువంటి సంకేతాలు ఇచ్చాడు అని పొలిటికల్ వర్గాల మాట.
మరి చూద్దాం భవిష్యత్తులో వీరిరువురి కలయిక జరుగుతుందో లేదో..