లేడీ సూపర్‌స్టార్‌ని 'వీరు' ఇంప్రెస్‌ చేయలేకపోతున్నారా!

మరిన్ని వార్తలు

లేడీ సూపర్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన విజయ శాంతి త్వరలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలకు ధీటుగా నటించిన హీరోయిన్‌గా విజయ శాంతికి స్పెషలైజేషన్‌ ఉంది. ఆమెది ఓ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌. అదే ఆటిట్యూడ్‌ని ఇప్పుడూ ఆమె ఫాలో చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేను నా ఆటిట్యూడ్‌ని మార్చుకోను.. అంటూ మొన్నామధ్య డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడికి ఆల్రెడీ ఆటిట్యూడ్‌ చూపించేసిన విజయ శాంతి, ఇప్పుడు నేటి భామలపైనా తన ఆటిట్యూడ్‌తో చిన్నపాటి కోటింగ్‌లాంటి కామెంట్‌ వదిలారు.

 

ఆ రోజుల్లో.. హీరోయిన్లు ఏడాది డజనున్నర సినిమాలు చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు సినిమా సినిమాకీ కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఒకటి, రెండు సినిమాలతోనే మాయమైపోతున్నారు. అప్పటి కమిట్‌మెంట్స్‌ ఇప్పుడు హీరోయిన్స్‌లో కనిపించడం లేదన్నారావిడ. అంతా బాగానే ఉంది. కానీ, ఆ రోజుల్లో హీరోయిన్స్‌ అవకాశాలు వేరు. సినిమా పరిస్థితులు వేరు. కానీ, ఇప్పుడు హీరోయిన్స్‌ పరిస్థితులు, అవకాశాలు పూర్తిగా వేరు. ఏ సినిమా ఎందుకు ఎలా ఎప్పుడు సక్సెస్‌ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

 

ఏ హీరోయిన్‌కి ఎందుకు క్రేజ్‌ వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. టాలెంట్‌ ఉండీ రాణించలేకపోతున్న వారు కొందరయితే, టాలెంట్‌ లేకున్నా, లక్కు కలిసొచ్చి చక్రం తిప్పేస్తున్న వాళ్లు ఇంకొందరు. ఇదీ నేటి హీరోయిన్స్‌ పరిస్థితి. ఆ కాలంలో హీరోయిన్‌గా చక్రం తిప్పి, చాలా ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న లేడీ సూపర్‌ స్టార్‌కి ఏం తెలుస్తాయిలెండి.. పాపం నేటి భామల సినిమా కష్టాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS