సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అందుకోసమే ప్రజల్లోకి కూడా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేశాడు. దీనికి తగట్టుగానే రజినీకాంత్ తన అభిమానులతో వీలైనంత వరకు టచ్ లో ఉండడానికి కొత్త టెక్నాలజీని వాడుకుంటున్నాడు.
ఆ తరుణంలోనే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో తన అధికారిక అకౌంట్స్ ని ప్రారంభించాడు. ఇక ఆయన క్రేజ్ తెలిసిందే గా అవి యాక్టివ్ అయిన కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫోల్లోవేర్స్ వచ్చేశారు. ఇప్పుడు ఉన్న సమాజంలో సోషల్ మీడియాని ఎవరైతే బాగా ఉపయోగించుకుంటారో వారికే ఎక్కువ మొత్తంగా ప్రజల్లో ఆదరణ ఉన్నట్టు గుర్తించే పరిస్థితి ఉంది.
ఇక సినిమాలలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రత్యర్ధి అయిన కమల్ హాసన్ ఈ విషయంలో ముందున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తొలి నుండి సోషల్ మీడియా వేధికగానే తన కామెంట్స్ వినిపించడం జరిగింది.
మరి రజినీకాంత్ ఈ సోషల్ మీడియా ని తన రాజకీయాలకి ఎంతవరకు వాడుకుంటాడో అనేది వేచి చూడాలి.