త్వరలో మొదలుకానున్న సూపర్ స్టార్ రజినీకాంత్- పా. రంజిత్ ల చిత్రం ప్రారంభం కాకముందే వివాదాస్పదమైంది.
వివరాల్లోకి వెళితే, ముంబై అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ జీవితాన్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం రూపొందనుంది అనే ఊహాగానాల నేపధ్యంలో హాజీ మస్త్తాన్ కొడుకు ఈ సినిమా యూనిట్ కి లీగల్ నోటిసులు పంపాడు. తన సమ్మతి లేకుండా తన తండ్రి జీవితం పై చిత్రం నిర్మించడం సరికాదని ఈ నోటిసులు పంపాడు.
అయితే పా. రంజిత్ మాత్రం హాజీ మస్తాన్ జీవితం పై ఈ సినిమా నిర్మించట్లేదు అని చెబుతున్నాడు. ఇలాంటి తరుణంలో రజిని ఈ లీగల్ నోటిసుల పై ఎలా స్పందిస్తాడో చూడాలి.