తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న 'కాలా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలపై పలువురు సుప్రీంకోర్టులో స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాజాగా ఆ స్టేని తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. సో 'కాలా' రిలీజ్‌కున్న అడ్డంకులు తొలిగిపోయినట్లే.
ఇకపోతే, గత చిత్రాల విజయాపజయాలతో సంబంధం లేకుండా, రజనీకాంత్ సినిమాలకు ఎప్పటికప్పుడే క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. అలాగే ఈ సినిమా విషయంలోనూ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 'కాలా'తో సూపర్‌స్టార్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రజనీకాంత్ 'కాలా' ఆశించిన స్థాయిలో రికార్డులు సృష్టించలేకపోయింది. విడుదలకు ముందే రజనీకాంత్ సినిమాలు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తాయి.
తమిళంలోనే కాదు, తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాలకున్నంత క్రేజ్ రజనీకాంత్ సినిమాలకుందంటే అతిశయోక్తి కాదు. అలాగే దేశం మొత్తం ఆయనకు అభిమానులున్నారు. 'కబాలి' సినిమా విడుదలకు ముందు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే విడుదల తర్వాత ఆ సినిమా రిజల్ట్‌తో 'కాలా' విషయంలో కొంత గోప్యత పాఠించిందట చిత్ర యూనిట్. హీరో కమ్ నిర్మాత ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 'కబాలి' డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి, సూపర్‌స్టార్‌కి జోడీగా నటించింది.
చూడాలిక 'కాలా'తో రజనీకాంత్ స్టార్ పవర్ బాక్సాఫీస్‌ని ఎలా ప్రభావితం చేస్తుందో.!