రజినీకాంత్ ‘కాలా’ విడుదల వాయిదా

By iQlikMovies - April 11, 2018 - 17:33 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అభిమానులకి ఒక పెద్ద పండగ అనే చెప్పాలి. అట్లాంటిది రజినీకాంత్ తాజా చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం, కాలా చిత్రం ఈ నెల 27న విడుదల కావడం లేదు. జూన్ నెలలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉందట. అయితే ఈ వాయిదాకి ముఖ్య కారణం- నిర్మాతల మండలి నిరసన, కావేరి అంశం ఇలా పలురకాల కారణాలతో ఈ చిత్రం విడుదల వాయిదాపడింది. ఇదే సమయంలో రజినీకాంత్ రోబో 2 చిత్రం కూడా వాయిదాలు పడుతూ ఎప్పుడు రిలీజ్ అవ్వనుందో అన్న అనుమానాలు వీడకముందే ఈ చిత్రం కూడా వాయిదా పడింది.

మొత్తానికి రజినీకాంత్ చిత్రం కాలా ప్రారంభానికి ముందు కథ విషయంలో వివాదస్పదమవ్వగా ఇప్పుడు మరోసారి విడుదల సమయంలో కొత్త చిక్కులతో విడుదల ఆలస్యం అవుతున్నది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS