తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదల చుట్టూ సరికొత్త అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్ పోన్ అవుతుంది అనీ, కాదు ప్రీ పోన్ అవుతుందనీ, గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అసలే ఇప్పటికే సూపర్ స్టార్ సినిమా 'రోబో 2' విడుదల కావాల్సి ఉంది. అయితే పలు కారణాల దృష్ట్యా ఆ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ మధ్య ఈ డేట్కే 'రోబో 2' ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఆ విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ ప్లేస్లోకే 'కాలా' వచ్చి చేరింది. ఇప్పుడు 'కాలా' విడుదల విషయంలో కూడా తలెత్తుతున్న అనుమానాల దృష్ట్యా, రజనీకాంత్ అభిమానుల్లో ఆందోళన మొదలవుతోంది.
మరో పక్క తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. ఇలాంటి తరుణంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేశారు. దాంతో రాజకీయ వివాదాలు కూడా మొదలవుతున్నాయి. ఆ వివాదాలు సినిమాపై ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే రిలీజ్ డేట్పై అనుమానాలు పెరిగిపోతున్నాయ్. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. 'కబాలి' డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాని తెరకెక్కించారు. గ్యాంగ్స్టర్ పాత్రలో నటించారు రజనీ ఈ సినిమాలో.
చూడాలి మరి ఈ వేసవిలోనైనా రజనీకాంత్ సినిమా 'కాలా' విడుదలయ్యేనో? లేదో? మరో పక్క 'రోబో 2' చిత్రం కూడా ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు. చూడాలి మరి. 'కాలా', 'రోబో 2' వీటిలో ఏది ఫస్ట్ రానుందో!