రజిని ఏరోజైతే తన కొత్త చిత్రం కాలా కి సంబందించిన షూటింగ్ మొదలుపెట్టాడో కాని ఆరోజు నుండి ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.
మొన్నీమధ్యనే తన తండ్రి జీవితాన్ని ఆధారం చేసుకునే ఈ చిత్రాన్ని తీస్తున్నారు అంటూ హంగామా సృష్టించాడు. ఇంతలోనే రాజశేఖర్ అనే వ్యక్తి ‘కాలా’ చిత్ర కథ, టైటిల్ అన్ని తనవే అని, తన అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అంటూ హైకోర్టుని ఆశ్రయించాడు.
దీనికి కౌంటర్ గా చిత్ర నిర్మాతలైన- ధనుష్, పా రంజిత్ లు అసలు రాజశేఖర్ ఎవరో తమకి తెలియదు అని కోర్టులో తమ వాదన వినిపించారు.
ఇక ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు ఈ కేసుని ఆగష్టు 3వ తేదీకి వాయిదా వేశారు. మొత్తానికి ఈ చిత్రం వల్ల రజినికి చాలా ఇబ్బందులే ఎదురుకుంటున్నాడు.