సూపర్‌ స్టార్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదిగో

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ధనుష్‌ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పా రంజిత్‌ డైరెక్షన్‌లో 'కబాలి' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ నుంచి అతి భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విడుదలయ్యాక అంచనాలు తారుమారయ్యాయి. అయితే ఈ సారి ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా సూపర్‌ స్టార్‌ అభిమానుల అంచనాలను అందుకునేలానే ఉంటుందంటున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోని తాజాగా విడుదల చేశారు. 'కాలా' అలియాస్‌ కరికాలన్‌ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు. కరికాలన్‌ అంటే యోధుడు, సమర్ధుడు అని అర్ధమట. అన్నీ ఆలోచించే ఈ సినిమాకి ఈ టైటిల్‌ని పెట్టడం జరిగిందంటున్నారు. ధనుష్‌ ఈ సినిమాని ఓ ఛాలెంజింగ్‌గా తీసుకున్నాడట. సినిమాకి సంబంధించిన అన్ని పనులను తానే జాగ్రత్తగా చూసుకోనున్నాడట. ప్రస్తుతం రజనీకాంత్‌ నటిస్తున్న 'రోబో 2.0' విడుదలకు సిద్ధమైంది. శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమీజాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS